సిరిసిల్లా: సిరిసిల్లా జిల్లా నేరెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వస్తుండగా విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థుల స్వస్థలం సిరిసిల్లాగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa