హైదరాబాద్: డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ ప్రకటించారు. నెదర్లాండ్‌కు చెందిన మైక్ కమింగాను నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిందిడిని కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. 33 ఏళ్ల మైక్ కమింగా 4 సార్లు భారత్‌కు వచ్చారు. నిందితుడి నుంచి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నాం. మైక్ కమింగా వీసా గడువు 2018 వరకు ఉంది. కోర్టులో హాజరు పర్చిన అనంతరం నిందితుడిని విచారించడానికి పోలీసు కస్టడీ కోరనున్నట్లు డీజీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa