హైదరాబాద్ ,జూలై 26 .కాంగ్రెస్ నేతలకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని ,అందుకే మంత్రి కె .టి .రామరావు మీద అర్ధం పర్థం లేని ఆరోపణలకు దిగుతున్నారని టి .ఆర్ .ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆరోపించారు .గాంధీభవన్ లో బుధ వారం కాంగ్రెస్ నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్ అబద్ధాలకు పరాకాష్ట గా ఆయన ఓ ప్రకటన లో విమర్శించారు .ముఖ్యంగా దాసోజు శ్రవణ్ లాంటి వారు కె .టి .ఆర్ ను తిడితే కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడి ఎదో ఒక పదవి దక్కక పోదనే ఆత్రుతతో చవకబారు ఆరోపణలకు దిగుతున్నారని శంభీ పూర్ రాజు ఆరోపించారు .కె.టి .ఆర్ స్వయంగా తనకు ఏ వాహన సంస్థ లేదని ప్రకటించినా పొలిసు వాహనాల కొనుగోలు లో హిమాంశు మోటార్స్ కు లబ్ది అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మండి పడ్డారు.
ఆరేడేళ్ల నుంచి హిమాంశు కార్యకలాపాలు లేనపుడు ఆ సంస్థకు హర్ష టొయోటాకు ఒప్పందం ఎలా కుదురుతుందని రాజు ప్రశ్నించారు .అసలు పోలిసుల వాహనాల కొనిగోలులో హిమాంశు మోటార్స్ కు లబ్ధికి సంబంధించి కనీసం ఒక్క సాక్ష్యాధారాన్నయినా శ్రవణ్ చూపగలరా అని సవాల్ విసిరారు .ఆధారాలు చూపక పోతే ముక్కు నేలకు రాసి శ్రవణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాజు డిమాండ్ చేశారు .తప్పుడు పత్రాలు విడుదల చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని కానీ వారు ప్రజల ముందు దోషులుగా నిలబడటం ఖాయమన్నారు .మాఫియా రాజ్యాలు నడిపిన కాంగ్రెస్ నేతలకు ఇపుడు కూడా అలానే ఉందనే భ్రమల్లో ఉన్నట్టున్నారని ఆయన ఎద్దేవా చేశారు.ఇసుక నుంచి నూనె కూడా సృష్టిస్తారనే సామెత కాంగ్రెస్ నేతలకు అక్షరాల సరిపోతుందని వారు జాతీయ సంపద అయినా ఇసుక ను తమ బొక్క సాలు నింపుకునేందుకు వాడుకున్నారని శంభీ పూర్ రాజు ఆరోపించారు .
నేరెళ్ల లో దళితుల పై దాడులు అంటూ మొసలి కన్నీళ్లు కారుస్తున్న కాంగ్రెస్ నేతలు తమ హాయం లో అణగారిన వర్గాల పై జరిగిన దారుణమైన దాడులకు ఏం సమాధానం చెబుతారని ఆయన నిలదీశారు ..నేరెళ్ల వ్యవహారం పై చట్టం తన పని తాను చేసుకుంటుందని దళితుల పై ఉద్దేశపూర్వకంగా దాడులకు పాల్పడ్డారని తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు .తెలంగాణ అమరవీరుల పై శ్రవణ్ కపట ప్రేమ కనబరుస్తున్నారని రాజు ధ్వజమెత్తారు .తెలంగాణ ఇవ్వడం లో కాంగ్రెస్ చేసిన జాప్యం ఫలితంగా నే వారు ఆమరులయ్యారనే విషయాన్ని ప్రజలు అంత తేలికగా మరిచి పోలేరన్నారు .స్థాయి కి మించి కె .టి .ఆర్ పై ఆరోపణలు చేస్తున్న శ్రవణ్ కు తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాజు హెచ్చరించారు .అడ్డ దిడ్డ మైన ఆరోపణలు ఇకనైనా మానుకోవాలని లేదంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa