సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో పోలీసులపై అసాంఘిక శక్తులు చేసిన దాడిని పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని గుర్తు చేసారు. లారీ ఢీకొని ఓ వ్యక్తి చనిపోయిన కారణంగా.. పోలీసులపై దాడికి పాల్పడడం సరికాదన్నారు. స్థానికంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి.. పోలీస్ శాఖను తీవ్ర పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని.. అతనిపై చర్యలు కఠిన తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa