ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2017, 02:48 PM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత ధరమ్‌ సింగ్‌ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కాంగ్రెస్‌ లో సీనియర్‌ నేత అయిన ధరమ్‌ సింగ్‌…2004 నుంచి 2006 వరకు కర్ణాటక సీఎం పనిచేశారు. కలబుర్గి జిల్లాలోని నిలోగి గ్రామంలో 1936 లో ధరమ్‌ సింగ్ జన్మించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఆసక్తి కనబరిచే వారు. ఈ క్రమంలో కాంగ్రెస్ లో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 14 లోక్‌సభలో బీదర్‌ ఎంపీగానూ ఎన్నికయ్యారు. ధరమ్ సింగ్‌ కు హైదరాబాద్‌ తోనూ అనుబంధం ఉంది. ఆయన తన ఎం.ఎ ఎల్‌.ఎల్‌.బి పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ నుంచే పొందారు. ఓ.యూలో ఉండి చదువుకున్నారు. ధరమ్‌సింగ్ సింగ్‌ మృతిపై ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ సంతాపం తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa