పట్నా: గాంధీని చంపిన గాడ్సేకు గుడికట్టాలని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని, అలాంటి బీజేపీతో నితీష్ కుమార్ చేతులు కలిపారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ఆ రోపించారు. బిహార్ అసెంబ్లీలో తమకు మెజారిటీ ఉన్నప్పటికీ గవర్నర్ పట్టించుకోలేదని, నితిష్‌ను ప్రభుత్వం ఏర్పాటుకు పిలిచారని ఆయన అన్నారు. మతవాద శక్తులతో నితీష్ చేతులు కలిపారని, ఎల్లుండి జరిగే విశ్వాస పరీక్షలో ఆయన ఓటమి ఖాయమని లాలూ అన్నారు. కాగా విశ్వాస పరీక్ష తర్వాతే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa