ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన శ్రేణులు తస్మాత్ జాగ్రత్త

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 27, 2017, 04:11 PM

హైదరాబాద్: పార్టీ స్థాపించి మూడేళ్లకు పైబడ్డా.. ఇప్పటికీ జనసేన అంటే ప'వన్' మాన్ షోనే. ఆ అపప్రదను తొలగించుకుని పార్టీని విస్తరించుకోవాలన్న ఉద్దేశంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోను పార్టీ కార్యకర్తలను పెంచుకునే పనిలో పడ్డారు పవన్. ఈ నేపథ్యంలోనే ప్రతీ జిల్లాలోను శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి.. పార్టీ అవసరాలకు అనుగుణంగా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ఈ తతంగం ఇంకా పూర్తి కాకముందే.. కొంతమంది వ్యక్తులు తాము జనసేన నియమించిన నేతలమంటూ జిల్లాల్లో హల్ చల్ చేస్తున్నారు. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి.. ఏకంగా వసూళ్లకు కూడా దిగుతున్నారు. దీంతో ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షిర్యాదులు అందాయి. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయన.. పార్టీకి డ్యామేజీ జరగకముందే యాక్షన్ లోకి దిగిపోయారు. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. జనసేన కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలంటూ అందులో పేర్కొన్నారు. పార్టీ తరుపున అధికారిక ప్రతినిధులెవరిని నియమించలేదని తెలిపారు.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa