గాలె వేదికగా జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో 600 రన్స్ చేసింది. ధావన్, పుజారా సెంచరీలతో రాణించగా.. 50వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ 47 పరుగులు చేశాడు. తొలి టెస్ట్ ఆడుతున్న హార్ధిక్ పాండ్యా 50 పరుగులు చేశాడు. మూడు వికెట్ల నష్టానికి 399 పరుగులతో రెండో రోజు గురువారం (జులై 27) ఉదయం నైట్ వాచ్‌మన్లు చతేశ్వర్ పుజారా (144), రహానే (39) ఆట ప్రారంభించారు. పుజారా వెంటనే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రహానే (57), వృద్ధిమాన్ సాహా (16), రవిచంద్రన్ అశ్విన్ (47), రవీంద్ర జడేజా (15), మహ్మద్ షమీ (30), హార్ధిక్ పాండ్యా (50) వెంటవెంటనే ఔట్ కావడంతో రెండో రోజు 201 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లను భారత్ కోల్పోయింది. సరిగ్గా 600 పరుగుల దగ్గర ఆలౌట్ అయ్యింది.
బ్యాటింగ్ కు దిగిన శ్రీలంకపై.. భారత్ బౌలర్లు విరుచుకుపడ్డారు. ఏడు పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కరుణరత్నె రెండు పరుగులకే ఔటయ్యాడు. ఉమేష్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. గుణతిలక 16 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కుశాల్ మెండీస్ డకౌట్ అయ్యాడు. షమి బౌలింగ్ లో ధావన్ కు క్యాచ్ ఇచ్చాడు. మూడు వికెట్ల నష్టానికి 110 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తోంది శ్రీలంక.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa