హైదరాబాద్: ‘ఫిదా’ చిత్రం తనను ఫిదా చేసిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వరుణ్‌తేజ్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘ఫిదా’. శేఖర్ కమ్ముల దర్శకుడు.జులై 21న విడుదలైన ఈ సినిమా విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చిత్రాన్ని చూసి యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ సినిమాను చూసిన కేటీఆర్ తాజాగా ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హృదయాన్ని కదిలించే ప్రేమకథ నిజంగా నన్ను ‘ఫిదా’ చేసింది! అభినందనలు.. శేఖర్ కమ్ముల, వరుణ్‌తేజ్, సాయిపల్లవి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa