హైదరాబాద్: మాదకద్రవ్యాల కేసులో సినీనటి ముమైత్‌ఖాన్‌ను ఆబ్కారీ శాఖ సిట్ విచారించింది. ఈ ఉదయం గంటలకు ప్రారంభమైన ఈ విచారణ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు నలుగురు మహిళా అధికారులతో ఏర్పాటుచేసిన విచారణ బృందం ఆమెను సుమారు ఆరు గంటలపాటు విచారించింది. నిన్న ఛార్మి కౌర్‌ను విచారించినట్టుగానే ముమైత్‌ఖాన్ విచారణను కూడా సాయంత్రం 5గంటలలోపే ముగించారు.
ప్రస్తుతం ఓ తెలుగు ఛానల్ నిర్వహిస్తోన్న రియాలిటీ షోలో ఉన్న ముమైత్‌ఖాన్ సిట్ ఎదుట హాజరయ్యేందుకు నిన్న రాత్రి పుణె నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాత్రి ఓ హోటల్‌లో బసచేశారు. అనంతరం ఈ ఉదయం నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయానికి చేరుకొని విచారణకు హాజరయ్యారు. విచారణలో ప్రధానంగా డ్రగ్స్ ముఠా నాయకుడు ముమైత్ ఖాన్‌ను కెల్విన్‌తో ఉన్న పరిచయాలపైనే ప్రధానంగా ఆరా తీసినట్టు తెలుస్తోంది. అతడి సెల్‌ఫోన్‌లో ముమైత్‌ఖాన్ ఫోన్ నంబర్ ఉండటంతో పాటు వీరిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ వివరాలను సైతం అధికారులు సేకరించినట్టు సమాచారం. వీటి ఆధారంగా ఆమెను సుమారు ఆరు గంటలపాటు విచారించారు. డ్రగ్స్‌తో సినీ పరిశ్రమకు ఉన్న సంబంధాలు, కెల్విన్ ఎవరెవరికి సరఫరా చేశాడు? డ్రగ్స్‌ను ఎవరు సమకూరుస్తారు, అసలు ముమైత్ ఖాన్‌కు డ్రగ్స్ వాడే అలవాటు ఉందా? ఒకవేళ ఉంటే ఎలా అలవాటైంది? తదితర ప్రశ్నలను సంధించి ఆమెనుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa