న్యూఢిల్లీ: క‌్రీడల్లో అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్నతోపాటు అర్జున అవార్డుల విజేతలను ప్రకటించే కమిటీలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్థానం సంపాదించాడు. అతనితోపాటు అథ్లెట్ పీటీ ఉషకు కూడా ఈ కమిటీలో స్థానం దక్కింది. ఈ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. అటు ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్ అవార్డుల విజేతలను ఎంపిక చేసే కమిటీలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్నూకర్ చాంపియన్ పంకజ్ అద్వానీలు స్థానం సంపాదించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa