మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్‌లో లారీ ఓనర్స్ అసోసియేషన్ భవన్ ముందు ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. వేగంగా వస్తున్న కారు నేరుగా వెళ్లి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నవీన్, సందీప్ అనే యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు సీసీసీ నాగార్జున కాలనీకి చెందినవారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa