హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా టాలీవుడ్ యాక్టర్ రవితేజ ఇవాళ సిట్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. సిట్ అధికారుల బృందం రవితేజను విచారిస్తున్న నేపథ్యంలో నాంపల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాలయానికి రవితేజ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఓ వైపు విచారణ కొనసాగుతుండగా మరోవైపు రవితేజ అభిమానులు సిట్ ఆఫీసు ఎదుట వేచి చూస్తున్నారు. సిట్ అధికారులు ఈ కేసులో నిన్న సినీ నటి ముమైత్‌ఖాన్‌ను ఆరున్నర గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa