రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. ఇవాళ సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరావుపేట మండలంలో హరితహారంలో భాగంగా మంత్రి పద్మారావు మొక్కలు నాటారు. పద్మారావుతోపాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో, తర్నికల్ గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ మొక్కలు నాటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa