ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాంశు మోటార్స్‌ కేటీఆర్‌దే: షబ్బీర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 28, 2017, 03:19 PM

హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భానికి ముందే ఆటోమొబైల్‌ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశానని చెబుతున్న మంత్రి కేటీఆర్‌.. 2014 ఎన్నికల అఫిడవిడ్‌లో హిమాంశు మోటార్స్‌లో రూ.30లక్షల విలువైన షేర్లు ఉన్నాయని ఎలా ప్రకటిస్తారని శాసనసమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ ప్రశ్నించారు. హిమాంశు మోటార్స్‌ కేటీఆర్‌దేనని.. దానికి ఆయన డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జైరామ్‌ రమేష్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అబద్ధాలు చెప్పిన కేటీఆర్‌కు ఏ శిక్ష వేయాలని ప్రశ్నించారు. 300 ఇన్నోవాల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. అలాగే స్వర్ణభారత్‌ ట్రస్టుకు ఎన్ని రాయితీలు ఇస్తున్నారో కూడా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa