ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలను కించపర్చడం టిఆర్‌ఎస్‌ నైజం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 01:37 AM

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః  టిఆర్‌ ఎస్‌ పార్టీకిగానీ, ప్రభుత్వానికి గాని మహిళలంటే చులకన భావం ఉందని, మహిళలను కించపర్చడం వారి నైజ ంగా మారిందని టిపిసిసి అధికార ప్రతినిధి బొజ్జ సంద్యారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆమె గాంధీభవన్‌లో  విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ గర్వించ దగ్గ నాయకురాలయిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే డికె అరుణపై టిఆర్‌ ఎస్‌ నాయకులు పస లేని మాటలతో అవమానపరిచే విధంగా మాట్లాడు తున్నా రని విమర్శించారు.  ప్రజల పక్షాన సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే తటు ్టకోలేని  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు గువ్వల బాల రాజు, ఆళ్ల వెంకటేశ్వర్‌ రెడ్డిలు మతి స్థిమితం లేనివారి మాదిరిగా మాట్లాడు తున్నారని  విమర్శించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తనస్థాయి మరిచిపోయి దిగజారి మాట్ల డుతున్నారన్నారు.  ముఖ్యమంత్రి మాట్లాడుతున్న  డికె అరుణ స్పందిస్తే టిఆర్‌ ఎస్‌ నాయకులు దిగజారిపోయి బజారురౌడీల్లా మాట్లాడు తున్నారని ఎద్దేవా చేశారు.  ఒక మహిళా నాయకురాలిని వ్యక్తి గత ంగా కించ పరిచే విధంగా మాట్లాడి రాష్ట్రంలో మహిళలను గౌరవాన్ని దిగ జార్చా రని విరుచుకుపడ్డారు.  ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో  ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వ కుండా అవమానించిన  కేసిఆర్‌, తన వంది మాగదులతో మహిళలపై ఇష్టాను సారంగా మాట్లాడిస్తున్నారన్నారని మండిపడ్డారు. మంత్రులను, ఎమ్మెల్యేలను  మహిళలు తిరగబడి కొట్టే రోజులు వస్తాయని ఆయన అన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa