-శ్రీనివాస్ హత్యపై స్పందించిన ట్రంప్.
-జాతి విద్వేష పూరిత చర్యగా అభివర్ణించడం తగదు
-ఇటువంటి చర్యలను ఎవ్వరూ సమర్థించరు
-ఎవరి మతాన్ని వారు సంకోచం లేకుండా అవలంబించవచ్చు
-ఈ ఘటనపై ్ట్రంప్ మాట్లాడాల్సిందే
-సునయన వీడియో పెట్టి ఘాటుగా స్పందించిన హిల్లరీ క్లింటన్
-కూచిభొట్ల శ్రీనివాస్‌కు అశ్రునయనాలమధ్య వీడ్కోలు
-అంత్యక్రియలకు భారీ ఎత్తున హాజరు
న్యూయార్‌క: కన్సాస్ సమీపంలోని ఓ బార్ లో హత్య కు గురైన కూచిభొట్ల శ్రీనివాస్ ఉదంతంపై డొనాల్‌డ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ఈ కాల్పుల ఘటన, ఆపై కన్సాస్ నుంచి వెలువడుతున్న వార్తలు తనను కలచివేశాయని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ సై్పసర్ పేర్కొన్నారు. బుధవారం జరిగిన కాల్పుల్లో శ్రీనివాస్ మరణించగా, ఆయన స్నేహితుడు అలోక్, మరో అమెరికన్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనను జాతి విద్వేష పూరిత చర్యగా అభివర్ణించడం తగదని, ఇటువంటి చర్యలను ఎవ్వరూ సమర్థించబోరని ట్రంప్ వ్యాఖ్యానించినట్టు సై్పసర్ పేర్కొన్నారు. కాగా, భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్, తన నాలుగు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకుని, హెచ్-1బీ వీసాల విషయంతో పాటు, ఇండియన్‌సపై దాడుల గురించి యూఎస్ అధికారులతో చర్చించనున్న నేపథ్యంలో వైట్ హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెరికా పౌరుల స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పరిరక్షించడమే మా విధి. ఇక్కడ స్వేచ్ఛగా సంచరించేందుకు ఏ ఒక్కరు కూడా భయపడకుండా చూస్తాం. ఎవరి మతాన్ని వారు ఎలాంటి సంకోచం లేకుండా అవలంబించవచ్చు. అమెరికన్ జాతి సూత్రాలను కాపాడేందుకు అధ్యక్షుడు కట్టుబడివున్నారు అని సై్పసర్ వ్యాఖ్యానించారు. కేసు విచారణలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికా రులు సైతం భాగం పంచుకుంటున్నారని తెలిపారు. కాగా, అధ్యక్షుడు ట్రంప్ ఈ కాల్పుల ఘటనపై ప్రత్యక్షంగా స్పందించకపోవడాన్ని హిల్లరీ క్లింటన్, బెర్నీ శాండర్‌స సహా పలువురు బహిరంగంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్‌డ ట్రంప్ చేతిలో తృటిలో ఓటమి చవిచూసిన హిల్లరీ క్లింటన్, కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై ఘాటుగా స్పందించారు. ఆయన భార్య సునయన, ట్రంప్ ఏం చెబుతారని ప్రశ్నిస్తున్న వీడియోను జత చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఆమె మండిపడ్డారు. అమెరికాలో బెదిరింపులు, జాతి విద్వేష నేరాలు పెరిగాయని, వీటిపై ట్రంప్ మాట్లాడాల్సిందేనని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు తాను చేయాల్సిన పనిని తాను చేయాలని, ఇతరులతో చెప్పించుకునే స్థితిలో ఉండరాదని అన్నారు. కాగా, శ్రీనివాస్ హత్య తరువాత జాతి విద్వేష నేరాలపై అమెరికాలో గతంలో ఎన్నడూ లేనంతటి చర్చ జరుగు తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఇండియన్‌స భద్రతపై పలువురు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇటీవలి ట్రంప్ ఇమిగ్రేషన్ ఉత్తర్వులను కోర్టులు అడ్డుకోవడంతో, వాటికి స్వల్ప మార్పులను చేస్తూ, మరో కొత్త చట్టాన్ని తెస్తానని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలో జరిగిన జాత్యాహంకార్ దాడిలో హత్యకు గురైన తెలుగు యువకుడు కూచిభొట్ల శ్రీనివాస్‌కు ఆయన బంధువులు, స్నేహితులు, ప్రజలు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు జూబ్లీహిల్‌సలోని మహాప్రస్థానంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వగృహం నుంచి ప్రత్యేక వాహనంలో మహాప్రస్థానానికి తరలించారు. భారీసంఖ్యలో బంధువులు, స్నేహితులు అక్కడికి తరలివచ్చారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచందర్రెడ్డి, సినీనటుడు రాజశేఖర్, జీవిత దంపతులు సహా పలువురు ప్రముఖులు శ్రీనివాస్‌కు నివాళులర్పించారు. అనంతరం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. కూచిభొట్ల శ్రీనివాస్ మౄఎతదేహం సోమవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి చేరుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. శ్రీనివాస్ కుటుంబసభ్యులు, స్నేహితులు, స్థానికులు విషాదవదనంతో విలపించారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు వర్థిని, మధుసూదనరావు కుప్పకూలిపోయారు. శ్రీనివాస్ మృతదేహాంతో పాటు వచ్చిన ఆయన భార్య సునయన బోరున ఏడ్చారు. శ్రీనివాస్‌ను కడసారి చూసేందుకు పెద్దయెత్తున ఆయన నివాసానికి పోటెత్తారు. బంధువులు, స్నేహితులు, స్థానికులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా శ్రీనివాస్ మృతదేహాన్ని చూసి నివాళలర్పించారు. అనంతరం అశ్రునయనాల మధ్య శ్రీనివాస్ మౄఎతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు.
జాతివివక్ష దాడులపై ట్రంప్ స్పందించాలి : హిల్లరి క్లింటన్
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇటీవల కాన్సస్‌లో జరిగిన జాత్యహంకార దాడిపై స్పందించారు. దేశంలో జరుగుతున్న దాడులపై ప్రెసిడెంట్ ట్రంప్ నోరు విప్పాలని ఆమె అన్నారు. కాన్సస్ బార్‌లో జరిగిన కాల్పుల్లో ఓ శ్వేతజాతీయుడు హైదరాబాద్ యువకున్ని కాల్చి చంపినదానిపై ఆమే ట్విట్ చేశారు. జాతివివక్ష దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశా లపై ట్రంప్ స్పందించాలని క్లింటన్ అకౌంట్ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. జాతి వివక్ష దాడులు జరుగుతున్నాయని దీనిపై అధ్యక్షుడు జవాబు చెప్సాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అలాంటి సంఘటన జరిగినప్పుడు అధ్యక్షుడు ముందుకు వచ్చి దీనిపై ఖండించాల్సి ఉండేదని హిల్లరి అన్నారు. కాన్సస్ దాడి తర్వాత శ్రీనివాస్ భార్య సునయన అమెరికా మీడియాతో మాట్లాడారు. తన భర్తను అన్యాయంగా చంపిన అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సునయన మాట్లాడిన వీడియోను హిల్లరీ తన ట్విట్టర్ లో పోస్‌ట చేశారు. అయితే కాన్సస్ లో జరిగిన సంఘటలనపై ఇంత వరకు దేశాధ్యక్షుడు ట్రంప్ స్పందించకపోవడాన్ని తప్పుపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa