సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అన్నారంలో సోలార్ ప్రీమియర్ మాడ్యుల్ యూనిట్ ను మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి ప్రారంభించారు. సోలార్ తో నడిచే ఈ రిక్షా, ఈ బైక్, ఈ సైకిల్ ను మంత్రులు విడుదల చేశారు. రూ.100 కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసిన ప్రీమియర్ సోలార్ పరిశ్రమ మార్కెట్ లోకి విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా రెప్పపాటు క్షణం కరంటు పోకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సర్కారు అహర్నిశలు కృషి చేస్తుంది. దీంతో రాష్ర్టానికి వందలాది పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అంతే కాకుండా ఉన్న పరిశ్రమలకు అదనంగా విస్తరించుకోవడానికి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా దేశంలో తొలి సారిగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ ధృవీకరణ పొందిన ఉత్పాదనతో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేసింది.