తిరుపతి: తిరుమల శ్రీవారిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులను ఆయన పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి ఆయనకు దర్శనం చేయించారు. దర్శనానంతరం వేదపండితులచే ఆశీర్వచనం అందించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు అర్చకులు. స్వామి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు తుమ్మల. తన మనవడి పుట్టెంటుకలు తీయడానికి తిరుమల వచ్చానని, ఇరు తెలుగు రాష్ట్రాలు అభివృద్దిలో ముందుకు పోవాలని ఆ దేవదేవున్ని ప్రార్దించానని ఆయన పేర్కొన్నారు.