సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం అన్నారంలో ప్రీమియర్ సోలార్ మాడ్యుల్‌ను మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. సోలార్‌తో నడిచే ఈ-రిక్షా, ఈ-బైక్, ఈ సైకిల్‌ను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూతెలంగాణ పరిశ్రమలకు స్వర్గధామం. గత పాలకులు ఎన్నడూ పరిశ్రమల గురించి పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ కృషితో పరిశ్రమలకు 24 గంటలు కరెంటు సరఫరా చేస్తున్నాం. కరెంటుతో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి. కాలుష్య రహిత పరిశ్రమలు రావడం మనకు శుభ పరిణామం. కొత్త టెక్నాలజీ వినియోగానికి మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. పటాన్చెరును మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.