సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం మండలం అన్నారంలో ప్రీమియర్ సోలార్ మాడ్యుల్‌ను మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. సోలార్‌తో నడిచే ఈ-రిక్షా, ఈ-బైక్, ఈ సైకిల్‌ను మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ nరూ.7వేల కోట్లతో కొత్త పరిశ్రమల స్థాపన జరిగింది. 200 మెగావాట్ల యూనిట్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోనే సోలార్ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం రెండువేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. రాబోయే రెండేళ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఐదువేల మెగావాట్లకు తెలంగాణ రాష్ట్రం చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా రెండు లక్షల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని తెలిపారు.