హైదరాబాద్ : రవీంద్రభారతిలో సినారె జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ కవిత, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. స్మరనారాయణీయం పుస్తకాన్ని ఎంపీ కవిత ఆవిష్కించారు. ఈ సందర్భంగా ఆచార్య గోపి ప్రసంగిస్తూ... సినారె అదృశ్య రూపంలో మనలోనే ఉన్నట్లు ఉంది. కవులంటే సీఎం కేసీఆర్‌కు మహా అభిమానమన్నారు. అనంతరం దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సి నారాయణరెడ్డి భావ విన్యాసాలు మధురాతి మధురం. సినారె అభ్యుదయ దృక్పథం కలిగిన వ్యక్తి. సినారె అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఒక కవిని ఆరాధిస్తే ఈ స్థాయిలో ఉంటుంది అనడానికిదే నిదర్శనం. కృష్ణమ్మ, గోదారమ్మ, నీళ్లతో రైతుల పాదాలకు అభిషేకం చేసేందుకు సీఎం కేసీఆర్ అనునిత్యం కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌పై సినారె ప్రభావం ఎంతో ఉంది. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప కవి సినారె అని కొనియాడారు. అనంతరం సాంస్కృతిక సారథి అధ్యక్షుడు రసమయి మాట్లాడుతూ... సినారెను స్మరించుకోవడం ఆనందంగా ఉంది. మహనీయునికి ఎప్పుడూ మరణం ఉండదని తెలిపారు.