నాగర్ కర్నూల్ జిల్లా వెల్దంద మండలంలోని చౌడర్ పల్లి గ్రామంలో యాదవులకు గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. 60 ఏళ్ళ అభివృద్ధిని 3 ఏళ్ళలో చేసి చూపించాం. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏమి వెలగ పెట్టారని ఎద్దేవా చేశారు. లిఫ్డ్ ఇరిగేషన్ ద్వారా కల్వకుర్తికి సాగునీరు అందిస్తామని తెలిపారు. తన నియోజక వర్గానికి రావద్దని అన్న వంశిచందర్ రెడ్డిపై మంత్రి మండిపడ్డారు. మీ ఊర్లో అప్పారెడ్డిపల్లిలో మీటింగ్ పెడతా.అడ్డుకోవడానికి దమ్ము ఉందా అని ప్రశ్నించారు. కల్వకుర్తి నీ ఒక్కడి జాగీరు కాదు. తెలంగాణ ఉద్యమంలో మీరు ఎక్కడ ఉన్నారు. చివరి రోజుల్లో ఆంధ్రా సీఎం వెంట ఉన్న వంశీచందర్ రెడ్డికి నన్ను పేరుపెట్టి ప్రశ్నించే నైతిక హక్కులేదు. ఇప్పటికైనా పద్దతిగా ఉంటే బాగుంటుంది. ఎవరెన్ని అడ్డంకులు సృంష్టించినా ఈ ఏడాది కల్వకూర్తి ప్రాంతానికి సాగునీరు అందిస్తాం. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకంటే ప్రజలు బుద్ది చెబుతారని తెలిపారు. ఇన్నాళ్లు కల్వకూర్తికి నీళ్లు రాకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే. పదేళ్లు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. ఆనాడు నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు.