హైదరాబాద్ : రవీంద్రభారతిలో సినారె జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ కవిత, నందిని సిధారెడ్డి, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. స్మరనారాయణీయం పుస్తకాన్ని ఎంపీ కవిత ఆవిష్కించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ... సినారె నుంచి ఈ తరం ఎంతో నేర్చుకుందని తెలిపారు. ఎంత ఎత్తుకు ఎదిగినా... ఒదిగి ఉన్న మహనీయుడు సినారె. సినారె ఔన్నత్యం మహోన్నతం. ఆయన భావితరాలకు ఆదర్శప్రాయులని కొనియాడారు. సినారె తుది శ్వాస వరకు కలం విడవలేదు. తెలంగాణ మట్టలోనే ఏదో మహత్యం ఉంది. సాటివారి కోసం ఆరాటపడే తత్వం మనలోనే ఉంది. సినారె స్మారక చిహ్నం నిరంతరం వెలిగే జ్యోతిగా నిర్మిస్తామని పేర్కొన్నారు. సినారె రాసిన గీతాలు సంపుటిగా ప్రచురిస్తం. ఆయన రాసిన 3500 చలనచిత్ర గేయాలను పదిలపరుస్తం. సినారె సాహిత్యపరిషత్‌కు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు ఇస్తానని ఎంపీ ప్రకటించారు.