జిన్నారం: తెలంగాణ యువతలో కష్టపడి పనిచేసే గుణం ఉందని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ కోరారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అన్నారంలో 200 మెగావాట్ల ఆటోమేటిక్ సౌర ఫలకాల తయారీ లైన్‌తోపాటు సౌరశక్తి ఈ-వాహనాలను ప్రారంభించారు. పర్యావరణానికి నష్టం లేకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడం అవసరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్థానికులకు వందశాతం ఉద్యోగాలు ఇచ్చే విధంగా దృష్టి సారించాలన్నారు. అన్ని జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కేటీఆర్ స్పష్టంచేశారు.