హైదరాబాద్: ప్రఖ్యాత రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత దివంగత సి.నారాయణరెడ్డి (సినారె) జయంతి వేడుకల్ని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ కవిత పాల్గొని మాట్లాడుతూ.. సినారె పేరిట అద్భుతమైన స్మృతి వనాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. తెలంగాణ సారస్వత్ పరిషత్‌కు ఎంపీ నిధుల నుంచి రూ.10కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన రాసిన పాటలు, గేయాలను ఓ సంకలనంగా తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సినారె కృషి, నిబద్ధత నేటి యువతరానికి ఆదర్శప్రాయమని కొనియాడారు.