తిరుమల: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తిరుమల శ్రీవారి దర్శనార్దం ఇవాళ తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నాయిని పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన నాయినికి టీటీడీ అదికారులు ఘనంగా స్వాగతం పలికారు. నాయిని కుటుంబసభ్యులు ఉండేందుకు అధికారులు బస ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం వీఐపీ విరామ సమయంలో నాయిని కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోనున్నారు.