రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఏఐయూ అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 291.3000 గ్రాముల బంగారం, ప్రోటీన్ పౌడర్, మొబైల్ ప్లాన్స్, ఫర్‌ఫ్యూమ్స్ , సోనీ వీడియో ప్లేయర్‌ను అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ రూ.10 లక్షల 33వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa