రంగారెడ్డి: రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. హరితహారంలో భాగంగా వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్స్‌లో 75 వేల మొక్కలతో హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య దంపతులు మొక్కలు నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో రిసార్ట్స్ ఎండీ, కేంద్ర మాజీ ఎన్నికల ప్రధానాధికారి లింగ్డోతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.