హైదరాబాద్: కంటోన్మెంట్ ఏరియా పరిధిలో స్థానిక ప్రజలు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తు పనుల గురించి అధికారుల కోసం ఎదురుచూడలేదు. తమ ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్లను కాలనీవాసులంతా ఒక్కటై చక్కదిద్దుకున్నారు. కంటోన్మెంట్ ఏరియా పరిధిలోని ఓ ప్రాంతంలో రోడ్డు సుమారు 12 ఫీట్ల వరకు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. గుంతలతో ప్రమాదాలు జరుగకుండా ఉండాలని భావించిన స్థానికులంతా ఒక్కటై పలుగు, పార, తట్టలు చేత పట్టుకుని స్వచ్ఛందంగా గుంతలను మట్టితో పూడ్చివేశారు. స్థానికుడు చంద్రశేఖర్ అనే వ్యక్తి మాట్లాడుతూ రోడ్డును బాగు చేసే వరకు తాము తాత్కాలికంగా మట్టి వేసి పూడ్చివేశామని..కంటోన్మెంట్ అధికారులు ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.