ముంబై: ముంబై ఘాట్ కోపర్‌లో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనకు సంబధించి రెండో నిందితుడు అనిల్ మందల్‌ను రిమాండ్‌కు తరలించారు. బోయివాడా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల మేరకు నిందితుడికి ఆగస్టు 2 వరకు పోలీస్ కస్టడీ విధించారు. ఈ భవనంతో సంబంధమున్న శివసేన నేతను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన ఈ ఘటనలో 17మంది మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa