తిరుమల: తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న నాయినికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు పలికారు.
అనంతరం నాయిని నర్సింహారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మనవరాలు, మనవడు పుట్టెంట్రుకలు తీసి స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు.తమ ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో కలిసి ఉండాలని.. రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.