ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిట్‌ విచారణకు హాజరైన తనీష్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2017, 10:52 AM

హైదరాబాద్‌: మాదకద్రవ్యాల కేసులో విచారణ నిమిత్తం సినీనటుడు తనీష్‌ ఈరోజు ఆబ్కారీ శాఖ సిట్‌ అధికారులఎదుట హాజరయ్యారు. తొమ్మిదిరోజుల పాటు పలువురు సినీ ప్రముఖులను విచారించిన సిట్‌ అధికారులు పదోరోజు తనీష్‌ను విచారణకు పిలిచారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న విచారణకు సాయంత్రం వరకు కొనసాగే అవకాశముంది. ఈ కేసులో ఇప్పటికే పూరీ జగన్నాథ్‌, శ్యామ్‌.కె.నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌, నవదీప్‌, చిన్నా, చార్మి, ముమైత్‌ఖాన్‌, రవితేజ, రవితేజ డ్రైవర్‌ను విచారించిన సంగతి తెలిసిందే. మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన కెల్విన్‌తో ఉన్న సంబంధాలు, కొకైన్‌ సరఫరా చేస్తూ పట్టుబడిన జాక్‌తో ఉన్న పరిచయాలపై లోతుగా విచారించనున్నారు. తనీష్‌ బాలనటుడిగా, నటుడిగా సుమారు 20 సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘నక్షత్రం’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com