ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉస్మానియాలో జూనియర్ డాక్టర్ల ఆందోళన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 31, 2017, 12:36 PM

హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఓ రోగి రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. రోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడి బంధువులు ఆరోపించారు. అంతటితో ఆగకుండా వైద్యురాలిపై దాడికి దిగారు. వైద్యురాలిపై దాడిని నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించారు. తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. సాధారణ భాగాల్లో విధులు బహిష్కరించిన వైద్యులు.. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. జూడాల ఆందోళనతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com