నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు రాష్ట్రప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం 2లక్షల 66వేల 936 ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు గృహనిర్మాణ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నది. లక్షా 59వేల 637 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతి దక్కగా, స్థలాల ఎంపిక పూర్తయితే మిగిలిన వాటికి ప్రభుత్వం అనుమతులివ్వనున్నది. ప్రస్తుతం 39వేల 427 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణ దశలో ఉండగా పరిపాలనాపరమైన అనుమతి పొందిన 1930 ఇండ్ల నిర్మాణాలను గృహనిర్మాణ శాఖ అధికారులు పూర్తి చేశారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం..ఈ ఆర్థిక సంవత్సరానికి ఇండ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.