భూపాలపల్లి : భూపాలపల్లి - కాటారం రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. మంథని ఎమ్మెల్యే పుట్ట మధు భార్య శైలజ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడింది. శైలజకు స్వల్ప గాయాలయ్యాయి. మంథని సర్పంచ్‌గా శైలజ సేవలందిస్తున్నారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శైలజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa