సూర్యాపేట : సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ సురేంద్ర మోహన్ వికలాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాలో ప్రారంభించిన జనహితలో ట్రై సైకిళ్ల కోసం వికలాంగులు దరఖాస్తు చేసుకున్నారు. జనహితలో దరఖాస్తు చేసుకోగానే ట్రై సైకిళ్లు రావడం సంతోషంగా ఉందని వికలాంగులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రుణపడి ఉంటామని వికలాంగులు చెప్పారు.