హైదరాబాద్: డ్రగ్స్ కేసుకు సంబంధమున్న పెద్దలను వెంటనే అరెస్ట్ చేయాలని, మాదకద్రవ్యాలను అరికట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి సోమవారం పాదయాత్ర చేపట్టారు. అయితే, పోలీసులు పాదయాత్రను అడ్డుకున్నారు.రేవంత్ రెడ్డి పాదయాత్ర అసెంబ్లీ వైపు బయలుదేరగా ట్యాంక్ బండ్ సమీపంలో పోలీసులు ఆపారు. ఆ సమయంలో పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పాదయాత్ర చేపడితే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.దీంతో అనుమతి లేదు కాబట్టే అడ్డుకుంటున్నామని పోలీసులు రేవంత్ రెడ్డికి స్పష్టం చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో నిరసన తెలుపుతూ.. డ్రగ్స్ కేసులో అధికార పార్టీ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. అందువల్లే విచారణ తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.