హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న యువ హీరో తనీశ్‌ను సిట్ అధికారులు సోమవారం విచారించారు. నాలుగు గంటల పాటు తనీశ్‌ను విచారించిన సిట్ అధికారులు. అతడి నుంచి డ్రగ్స్‌కు సంబంధించిన పలు అంశాలను రాబట్టినట్లు సమాచారం. జీషాన్‌తో తనీశ్‌కు సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సిట్ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. విచారణ ముగిసిన అనంతరం తనీశ్ మీడియాతో మాట్లాడుతూ.. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. డ్రగ్స్ కేసులో తన పేరు రావడం బాధాకరమని చెప్పారు. తనపై వస్తున్న కథనాలతో తన కుటుంబం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడకం ప్రమాదకరం.. దాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. సే నో టూ డ్రగ్స్ కోసం అందరం కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 1న మరో నటుడు నందును విచారిస్తే టాలీవుడ్ నటుల తొలి విడుత విచారణ పూర్తవుతుంది. సినీ ప్రముఖుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో టాలీవుడ్‌తోపాటు ఇతర రంగాలకు చెందిన వారిలో ఆందోళన మొదలైంది. సిట్ అధికారులు రూపొందించిన రెండో జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో అని సినీపరిశ్రమలో జోరుగా చర్చ జరుగుతున్నది.