నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ రాజీవ్ చౌక్‌లో ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. పిచ్చి కుక్క దాడిలో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 17 మందిని నల్లగొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిచ్చి కుక్కను పట్టుకునేందుకు స్థానికులు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.