న్యూఢిల్లీ: సినీ నటి భావన కిడ్నాప్, లైగింక వేధిపులకు గురయిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పందిం చని భావన మొదటిసారిగా సోషల్ మీడియాలో స్పందించింది. నాకు అండగా నిలిచిన వారం దరికీ కృతజ్ఞతలు. జీవితం కొన్నిసార్లు నన్ను కిందకి తోసేసింది, ఆ ఘటనలను నేను గుర్తుచే సుకోదల్చుకోవడం లేదు. నేను జీవితంలో విషా దాన్ని, అపజయాలను చూశాను. అయితే, ఒక్క విషయాన్ని మాత్రం కచ్చి తంగా చెప్పగలను. నేను ఎన్నిసార్లు కింద పడినా తిరిగి లేస్తాను అని ఆమె పేర్కొంది. తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పింది. భావన కేసులో వేగంగా విచారణ జరిపిన పోలీసులు నిందితులని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భావనపై జరిగిన దారుణాన్ని ఖండిస్తూ ఎం తో మంది సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకి కఠిన శిక్ష వేసి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని డిమా ండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa