హైదరాబాద్ : కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఇవాళ మంత్రి పద్మారావు కలిశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల నిర్మాణ స్థలంపై దత్తాత్రేయతో చర్చించినట్లు మంత్రి పద్మారావు తెలిపారు. ఈ సందర్భంగా పద్మారావు మాట్లాడుతూ లాలాపేట రైల్వే శాఖకు చెందిన 10 ఎకరాల స్థలాన్ని డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ఇప్పించాల్సిందిగా దత్తాత్రేయని కోరినట్లు వెల్లడించారు. ఇండ్ల నిర్మాణానికి రైల్వే భూమిని ఇవ్వాలని రైల్వే మంత్రి సురేష్‌ప్రభును సీఎం కేసీఆర్ కోరినట్లు తెలిపారు. రైల్వే భూమిని ఇండ్ల నిర్మాణానికి ఇప్పించాలని దత్తాత్రేయను కోరానని పద్మారావు తెలిపారు. రేపు సురేష్ ప్రభును కలిసి రైల్వే భూమిపై చర్చిస్తానన్నారు. రైల్వే భూమి ఇచ్చినందుకు భూమికి భూమి లేదా డబ్బులైనా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆగస్టు 11న మరోసారి మంత్రి కేటీఆర్‌తో కలిసి సురేష్ ప్రభును కలుస్తమన్నారు.