చెట్లుంటేనే భవిష్యత్ తరాలకు మనుగడ సాధ్యమని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటడంతోపాటు హరిత పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెదక్ జిల్లాలో పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. చెల్మెడ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని, మొక్కలు నాటారు. అక్కన్నపేట అటవీ ప్రాంతంలో సీడ్ బాల్స్ విసిరారు. రామాయంపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.