జనగామ: జనగామ రవాణాశాఖ కార్యాలయం ఆవరణలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. హరితహారంలో పాల్గొని మంత్రి మహేందర్రెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండలి విప్ బోడకుంట వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ప్రజల సహకారంతో హరితహారం ఉద్యమంలా సాగుతోందని తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలతో పాటు హరితహారం కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రతి విద్యార్థి మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 120 కొత్త బస్సులు అందించినం. ఆర్టీసీని ఆదుకుంనేందుకు సీఎం కేసీఆర్ బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించారు. వజ్ర ఏసీ మినీ బస్సులతో వరంగల్ ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపరిచామని వెల్లడించారు.