ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గులాబ్‌జామున్‌తో పాటు జ్యూస్‌ ఇచ్చారు..ఆమెను గదిలోకి తీసుకువెళ్లి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 01, 2017, 11:06 AM

హైదరాబాద్‌: ఉద్యోగం వచ్చిందని యువతిని కార్యాలయానికి పిలిపించి మత్తు మందు కలిపిన జ్యూస్‌ ఇచ్చి లైంగిక దాడి జరిపాడు. ఈ విషయం బయటకు చెబితే అసభ్యకరమైన చిత్రాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు యువతి ధైర్యం చేసి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కంపెనీ నిర్వాహకుడిపై 354,354(ఎ),509 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10కి చెందిన కేపీఆర్‌ ఇంటర్‌ కాంటినెంటల్‌ కంపెనీ యజమాని రాజశేఖర్‌రెడ్డి ఉద్యోగులు కావాలని ప్రకటించాడు. ఓ యువతి(29) దరఖాస్తు చేసుకుంది.


ఇంటర్వ్యూ అనంతరం మార్చి 6న ఉద్యోగం వచ్చినట్టు అపాయింట్‌‌మెంట్‌ లెటర్‌ ఇచ్చారు. ఏప్రిల్‌ 30న జీతం గురించి మాట్లాడేందుకు కార్యాలయానికి వెళ్లింది. అక్కడ ఉన్న సిబ్బంది గులాబ్‌జామున్‌తో పాటు జ్యూస్‌ ఇచ్చారు. కొద్ది సేపటికి యువతి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను గదిలోకి తీసుకువెళ్లి కంపెనీ యజమాని రాజశేఖర్‌రెడ్డి లైంగిక దాడి చేశాడు. అనంతరం ఇంటికి చేరుకున్న యువతికి రాజశేఖర్‌రెడ్డి ఫోన్‌ చేసి బెదిరించాడు. బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com