హైదరాబాద్: డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల విచారణ నేటితో ముగియనుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మొదలైన విచారణలో భాగంగా నిన్నటి వరకు 11 మందిని సిట్ అధికారులు విచారించారు. ఈరోజు నందు విచారణకు హాజరయ్యాడు. డ్రగ్స్ వ్యవహారంలో 12 మంది సినీ ప్రముఖులకు ఆబ్కారీ శాఖ సిట్ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. జులై 19 నుంచి ఇప్పటివరకు పూరీ జగన్నాథ్, శ్యామ్.కె.నాయుడు, సుబ్బరాజు, నవదీప్, తరుణ్, చార్మి, ముమైత్‌ఖాన్, రవితేజ, రవితేజ డ్రైవర్, తనీష్‌లను విచారించారు. కెల్విన్‌తో సంబంధాలు, డ్రగ్స్ వినియోగం తదితర అంశాలపై అధికారులు నందును ప్రశ్నిస్తున్నారు.