హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రి రోగులకు చాలా కష్టం వచ్చింది. ఉస్మానియా ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు గత రాత్రి నుంచి సేవలు నిలిపివేశారు. గతరాత్రి 8 గంటల సమయంలో రోగుల బంధువులు తమపై దాడి చేశారని, వారిని శిక్షించి, తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు విధుల బహిష్కరించారు. దీంతో ఆసుపత్రిలో రోగులు అల్లాడిపోయారు. అయితే సీరియస్ కండిషన్ లోని రోగులకు సీనియర్ నర్సులు సహాయసహకారాలు అందించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. తమకు న్యాయం చేయాలని కోరుతూ జూనియర్ వైద్యులు సూపరిండెంట్ ఛాంబయర్ ముందు బైఠాయించారు. దీంతో అవుట్ పేషంట్, ఇన్ పేషంట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సకాలంలో సేవలందక రోగులు అల్లాడిపోతున్నారు. దీంతో తక్షణ వైద్య సాయం కావాల్సిన రోగులు అంబులెన్సుల్లో గాంధీ, ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీశారు.