దళితుల పేరుతో కాంగ్రెస్ నాటకాలు ఆడుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళిత వాదాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసే వారి అంతు కచ్చితంగా తేలుస్తామని హెచ్చరించారు. అభివృద్ధికి ఆటంకంగా మారొద్దు, బంగారు తెలంగాణకు సహకరించాలని సూచించారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. దళితులను వాడుకుంటే పుట్టగతులుండవని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుంటే.. ఓర్వలేక మంత్రి కేటీఆర్‌పై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక అక్రమాలు జరిగాయని గువ్వల బాలరాజ్ స్పష్టం చేశారు.