వేములపల్లి మండలంలోని 8 గ్రామాలకు చెందిన 11 మందికి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఎంపీ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేశ్య ఉన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడపిల్లలకు బాగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు.