తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి ఏఐసీసీ తొలగించింది. ఆర్‌సీ కుంతియాను రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కుంతియాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది ఏఐసీసీ. కుంతియాతో పాటు ఏఐసీసీ కార్యదర్శిగా సతీష్ నియామకం అయ్యారు. తెలంగాణ ఏర్పడక ముందు నుంచే దిగ్విజయ్ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. నూతనంగా నియామకమైన కుంతియాకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa